Sunday, May 16, 2021

నెట్ వర్క్ మార్కెటింగ్ - ప్రయోజనాలు మరియు ఇబ్బందులు

 

NETWORK MARKETING MERITS AND DEMERITS

- నెట్ వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ను అమ్మే వ్యవస్థ.

- ఇది ప్రస్తుతం రిటైల్ అమ్మకం వ్యవస్థ కి భిన్నంగా, స్నేహితులకి, బంధువులకి, పరిచయస్తులకు, ఇతరులకి డైరెక్టుగా వస్తువులను అమ్మే ఒక పద్ధతి లేదా ఇలాంటి కంపెనీలలో చేర్పించే పద్ధతి.

- ఇప్పటివరకూ ఈ పద్ధతి వల్ల వేర్వేరు సామాజిక నేపథ్యాలున్న, వేర్వేరు ఆర్ధిక పరిస్థితుల నుండి వచ్చిన లక్షలాది మంది స్త్రీ పురుషులకి ఆర్ధిక స్వాతంత్ర్యం లభించింది అంటే డబ్బులు సంపాదించారు అనుకోవచ్చు.  

- ఈ Network Marketing కే Multilevel Marketing, Direct Selling, Relationship Marketing లాంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి.

- సంప్రదాయ వ్యాపార పద్దతుల్లో, ఓ స్థిరమైన ప్రదేశంలో వ్యాపారాన్ని (షాప్ ని) ఏర్పాటు చేసుకొని, వినియోగదారులు అక్కడికే వచ్చేలా ఆశించడం జరుగుతుంది.  

- దానికి భిన్నంగా Network Marketing లో ఒక స్థిరమైన లొకేషన్ కి బదులు అమ్మకందారుడు కస్టమర్ ఉన్నచోటికే వెళ్లి ముఖాముఖిగా కలిసి వ్యాపార లావాదేవీలు జరిపే ఓ పద్ధతి ఇది.

నెట్ వర్క్ మార్కెటింగ్ వల్ల  ప్రయోజనాలు: 

1. పెట్టుబడి లేని వ్యాపారం (రిస్కు తక్కువ): సంప్రదాయ వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. డబ్బుతో పాటు, సమయం, శ్రమ ఇవన్నీ కూడా ఖర్చవుతాయి. 

- Network Marketing లో పెట్టుబడి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఇక్కడ మీ నిజమైన పెట్టుబడి…మొదటిది మీ సమయం కాగా, రెండవది మీ యొక్క నైపుణ్యాలు (నాయకత్వ నైపుణ్యాలు, జట్టుని నడిపించడం, మీ క్రిందివారిని ఉత్సాహపరచడం…).

- ఇక్కడ రిస్కు ఉన్నప్పటికీ అతి తక్కువ స్థాయిలోనే ఉంటుంది.

2. నాణ్యత గల ప్రొడక్ట్స్: ఇది చాలా ముఖ్యమైనది. ఆర్థికావసరాల కోసమే మీరు Network Marketing లోకి దిగినప్పటికీ మీరు ప్రమోట్ చేసే ఉత్పత్తుల నాణ్యతను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  

- ఇక్కడే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ అనేక Network Marketing  సంస్థలు మంచి Quality గల ఉత్పత్తులను అందిస్తున్నాయి.

- వీటిలోనుంచి ఉత్తమ స్థాయి వాటిని మాత్రమే ఎంచుకుని ప్రమోట్ చేయగలిగితే మార్కెట్లో మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. 

- అలా జరగాలంటే ఉత్పత్తులను ముందుగా మీరు స్వయంగా వాడి వాటి నాణ్యతను స్వయంగా పరీక్షించి నిర్ధారించుకున్న తరువాతే ప్రమోట్ చేసినట్లయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సాఫీగా మీ వ్యాపారం ముందుకి సాగుతుంది.

దీనికి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు. 

Q: నేను Network Marketing లో లేనట్లయితే నేను ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తానా?

Q: ఈ ఉత్పత్తులని ప్రమోట్ చేయడం ద్వారా నేను నా కస్టమర్లకి ఏదైనా నిజమైన ప్రయోజనాన్ని అందించగలుగుతున్నానా?

3. నిరంతర వ్యాపారం: కొన్ని ఉత్పత్తులు ఒకసారి కొనుగోలు చేస్తే మళ్ళీ చాలాకాలం పాటు కొనాల్సిన అవసరం ఉండదు (ఉదాహరణకి టీవీ, బైక్). మరికొన్ని వస్తువులు తరచుగా కొనుగోలు చేయాల్సివస్తుంది (కిరాణా సరుకులు, Healthcare ఉత్పత్తులు).  

- Network Marketing లో ఇలా మళ్ళీ మళ్ళీ కొనాల్సిన వస్తువులు ఉంటే వాటిని ఎంచుకోవడం ఎంతో మంచిది. Products Quality బాగా ఉండి, ప్రతీ నెలా క్రమం తప్పకుండా Purchase చేసే కస్టమర్లు ఉండడం వల్ల మీకు స్థిరమైన ఆదాయం రూపొందుతుంది. (మొదట్లో తక్కువ డబ్బులు వచ్చినప్పటికి తరువాత మంచి ఆదాయం ఉంటుంది)

4. అపరిమితమైన అభివృద్ధి (Unlimited Growth): Network Marketing లో మీ సంపాదనకి Upper Limit అంటూ ఉండదు. మీరెంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకళ్ళ ముందే కనబడుతుంది. 

5. మీకు మీరే యజమాని (Your Own Boss): ఠంచనుగా పొద్దున్న 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకిష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పిన పనులన్నీ చేయడం మీకస్సలు ఇష్టం లేదా? అయితే Network Marketing  మీకు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మీకంటూ Boss ఎవరూ ఉండరు, మీకు మీరే Boss. రోజులో ఏ సమయంలో పని చేయాలో మీరే స్వయంగా నిర్దేశించుకోవచ్చు.

6. పార్ట్ టైం ఆదాయం (Part Time Income): మీ ఉద్యోగాన్ని వొదిలిపెట్టి దీనికోసం ప్రత్యేకంగా Full Time పని చేయాల్సిన అవసరం లేదు. మీకున్న ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో Network Marketing  కోసం కాస్త సమయాన్ని కేటాయించవచ్చు. కొంత ఆదాయం సంపాదించిన తరువాత దేనిపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలన్న విషయం ఆలోచించుకోవచ్చు. 

7. Residual Income: సంప్రదాయ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పని చేసినన్ని రోజులకు మాత్రమే ఆదాయం లభిస్తుంది. ఈ సోమ్ములోనుండి ఖర్చులకి కొంత పోనూ మిగతా డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని వృద్ధాప్యంలో అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. అంటే పని చేస్తేనే ఆదాయం లభిస్తుందన్న మాట. 

- పని చేయడం ఆపివేసిన మరుక్షణమే మీకు ఆదాయం రావడం కూడా ఆగిపోతుందన్నమాట. అలా కాకుండా కొంత కాలం పనిచేసిన తరువాత పని చేయడం ఆపివేసినా కూడా ఆదాయం లభించే మార్గం ఉంటే ఎంత బాగుంటుంది కదూ! అలా లభించే ఆదాయాన్నే Residual Income అంటారు.  

- Network Marketing లో కూడా మీరు కొన్ని రోజులు శ్రమించి ఓ స్థాయికి చేరుకున్న తరువాత అప్పుడు మీకు Residual Income రావడం మొదలవుతుంది. మొదట్లో ఇది కొద్ది మొత్తమే కావొచ్చు కానీ మరింత కష్టపడా కొద్దీ ఈ మొత్తం కూడా పెరిగే అవకాశముంది. అయితే ఇలా నిరంతర ఆదాయం లభించాలంటే మీ Team ని కూడా ఉత్సాహపరుస్తూ ఓ స్థాయికి తీసుకెళ్ళాల్సి ఉంటుందని మరిచిపోవద్దు.

8. వ్యక్తిత్వ వికాసం: Network Marketing లో మీ Products ని అమ్మడానికై మీరు కొత్త వ్యక్తులను కలిసి మీ ఉత్పత్తుల గురించి వారికి వివరించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ సోషల్ Skills అద్బుతంగా మెరుగుపడతాయి. ప్రతీరోజు ఓ ఛాలెంజ్ లాగా అనిపిస్తూ ఆ ఛాలెంజ్ లను అధిగమించినపుడు గొప్ప సక్సెస్ సాధించామన్న గర్వం కలుగుతూంటుంది. వేరే ఇతర పనుల్లో ఇలాంటి సంతృప్తి ఎప్పుడోగాని కలగదు.  

- క్రమేణా మీ Communication Skills అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. పరోక్షంగా, మీ వ్యక్తిత్వం మరింత తీర్చిదిద్దబడుతుంది. వీటన్నిటితో పాటు వ్యాపార కిటుకులు, మెళుకువలు వంటపడుతాయి. దానివల్ల మరేదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ మీరు కలిగి ఉంటారు.

నెట్ వర్క్ మార్కెటింగ్ లో ఇబ్బందులు:  

1. ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం: Network Marketing పై ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం ఒక పెద్ద మైనస్ Point. పిరమిడ్ స్కీములు, సర్క్యులేషన్ స్కీములు, చైన్ స్కీముల పేరిట ఈ రకమైన బిజినెస్ లను పిలవడం జరుగుతున్నది. అయితే సామాన్య ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణం లేకపోలేదు.  

- కొన్ని కంపెనీలు Network Marketing పేరుతో అనేక అనైతిక విధానాలను అనుసరిస్తూ, ప్రోత్సహించడం చేసాయి. సరయిన నియమ నిబంధనలు లేకపోవడం, ఆజమాయిషీ, నియంత్రణ లోపించడం వల్ల కూడా
ఈ పరిస్థితి ఏర్పడింది.

2. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం: Join అవుతున్న చాలామందికి, తాము కూడా కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయన్న విషయం తెలీదు. ఈ విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా Sponsor లు దాచిపెట్టి “నీకేం ఇబ్బంది లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అదంతా నేను చూసుకుంటాను” లాంటి మాటలతో మభ్యపెట్టడం జరుగుతున్నది. వీళ్ళ మాటలు విన్నవారు “కేవలం జాయిన్ అయిపోతే చాలు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు” అన్న భ్రమలోనే ఉండి చివరకు విఫలమవుతారు.  

3. Quality Products తక్కువ: Network Marketing కంపెనీల్లో కొన్ని కంపెనీలు ఎక్కువ నాణ్యత లేని నాసిరకం ఉత్పత్తులనే ప్రమోట్ చేస్తున్నాయి. సరుకుల Quality ని పెంచడానికి బదులుగా ఇవి Marketing వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి. కాబట్టి మనం చేరేటప్పుడు మంచి నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేసే లేదా ప్రమోట్ చేసే కంపెనీలలో చేరడానికి ప్రయత్నించాలి.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్


ఇవి కూడా చదవండి:

నెట్ వర్క్ అంటే ఏమిటి? మరియు ఎలా నిర్మించుకోవాలి?

నెట్ వర్క్ మార్కెటింగ్ ఎలా పని చేస్తుంది?

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top